![]() |
![]() |

ఇది కదా జనాలి కావాలి. ఎంటర్‌టైనర్ ఎవరైనా సరే బిబి ఆడియన్స్ వదులుకోరు.. అలాగే బిగ్ బాస్ సీజన్-7 లో భోలే షావలిని వదులుకోవడానికి ఆడియన్స్ ఇష్టపడలేదు.
బిగ్‌బాస్ సీజన్ -8 విన్నర్ ఎవరనేదానిపై దాదాపు 10 వారాల తర్వాత ఓ మోస్తరు క్లారిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా ఈ వీకెండ్ ఫ్యామిలీ, సెలబ్రెటీ గెస్ట్ స్టేజ్ మీదకి రావడం.. టాప్ -5 ఎవరో చెప్పడం చూస్తుంటే విన్నర్ ఆ ఇద్దరి మధ్యే ఉండేలా అనిస్తుంది. అయితే మొదటగా ప్రేరణ కోసం తన చెల్లి, కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ప్రేరణకి అత్తగా చేసిన ప్రియా, ఇంకా ప్రేరణ వాళ్ళ అమ్మ వచ్చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. ఇలా ఒక్కో కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కరు వచ్చారు. హైలైట్ గా నిలిచిందేంటంటే నబీల్ గురించి తన బ్రదర్ షబీల్, సింగర్ భోలే షావలి రావడమే. భోలే రాగానే హౌస్‌మేట్స్ అందరూ భోలే అంటే హీరో అంటూ గట్టిగా అరిచారు. ఇక వచ్చీ రాగానే నబీల్ గురించి ఓ పాట అందుకున్నాడు భోలే. నబీల్.. నీ గురించి లేదు మాకు దిగుల్.. నీ ఆట చూస్తే కంటెస్టెంట్ల గుండే గుబేల్ అంటూ తన ప్రాసలతో అల్లాడించాడు. షేర్ లా ఆడుతున్నావంటూ భోలే అన్నాడు. ఇక నబీల్ బ్రదర్ కూడా షేర్ ఇలానే ఆడాలి.. నువ్వు విన్నర్ అవ్వాలంటూ చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ సీజన్-7 లో కన్నడ బ్యాచ్ ని ఆడుకున్న భోలే.. ఆ సీజన్ లో ఫుల్ ఆఫ్ పంచులతో ఫుల్ వైరల్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన భోలే పంచులే.. అనేంతగా భోలే డైలాగ్స్ ప్రాసలతో కూడిన పాటలు ఉంటాయి. ఇక హౌస్ లో గౌతమ్, టేస్టీ తేజ ఇద్దరు బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ అయినప్పటికీ నబీల్ కోసం వచ్చాడు భోలే. వరంగల్ నీ కోసం ఎదురుచూస్తుంది నబీల్. కప్పుకి దగ్గర్లో ఉన్నావ్.. ఇలానే షేర్ లా ఆడాలంటూ గట్టిగా బూస్ట్ ఇచ్చాడు. భోలే అంటే హీరో అనే సినిమాని కూడా ప్రారంభించిన్నట్లు భోలే అన్నాడు. ఇక ఈ సీజన్-8 లో విన్నర్ ఎవరనేది తెలియాలంటే నాలుగు వారాలు మాత్రమే ఉంది.
![]() |
![]() |